ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పెంచిన పెన్షన్ ను అమలు చేసింది ప్రభుత్వం. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమలోకి తెచ్చింది చంద్రబాబు సర్కార్.గత ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీని రద్దు చేసి కొత్త ఇసుక పాలసీకి సంబంధించిన జీవోను కూడా విడుదల చేసింది ప్రభుత్వం. అయితే, ఉచిత ఇసుక పాలసీపై గందరగోళం నెలకొంది.ఉచిత ఇసుక విధానం కింద టన్నుకు రూ.1394 వసూలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగటమే ఇందుకు కారణం.
ఉచిత ఇసుక అనీ చెప్పారు ఇక్కడికి వస్తే టన్ను 675 అంటున్నారు ...
— VenkataReddy karmuru (@Venkat_karmuru) July 9, 2024
ట్రాక్టర్ ₹3100 చెప్తున్నరు.
అధికారులను అడిగితె మాకు తెలియదు పై నుంచి మాకు అలానే చెప్పారు అనీ అంటున్నారు.
అంత అయితే కులీలకు కూడా రాదు మేము నష్టపోతాము.
అందుకే వెనిక్కీ వెళ్తున్నాము
పోయాం మోసం అంటున్న సామాన్యులు pic.twitter.com/RRtn7tOUMS
ఉచిత ఇసుక విధానం అంటూ హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కిందంటూ ప్రతిపక్ష వైసీపీ సొషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే, ఈ ప్రచారంలో వాస్తవం లేదంటూ అధికార టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఒక ఇసుక ట్రాక్టర్ ( 4.5 టన్నులు ) కి గాను రూ.1305 మాత్రమే వసూలు చేస్తున్నామంటూ రశీదులతో సహా పోస్ట్ చేసి వైసీపీ ప్రచారాన్ని తిప్పి కొడుతోంది. మరి, ఈ గందరగోళానికి ఎప్పడు తెర పడుతుందో చూడాలి.
Also Read:కడపకు ఉప ఎన్నిక వస్తే.. గల్లీగల్లీ ప్రచారం చేస్త
కృష్ణా జిల్లాలో 4.5 టన్నుల ట్రాక్టర్ ఇసుక కేవలం రూ.1305 /- అంటే టన్ను పడింది రూ.290 (ఇవి కూడా లోడింగ్, రవాణా చార్జీలు. ఇసుక ఉచితం).
— Telugu Desam Party (@JaiTDP) July 9, 2024
గతంలో జగన్ రెడ్డి ప్రభుత్వంలో ట్రాక్టర్ రూ.8000 వరకు దోచుకునే వారు..@ysjagan నువ్వు ట్రాక్టర్ పంపించినా, ఇదే రేటుకి ఇస్తుంది మా ప్రభుత్వం..
ఖులం… pic.twitter.com/J2IgiEGh0h