తెలంగాణ టెట్ పరీక్షల హాల్‌టికెట్ల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ రోజు (మే 15)వ తేదీ బుధవారం హాల్‌టికెట్లను విడుదల చేస్తామని ప్రకటించిన విద్యా శాఖ ఇప్పటి వరకు హాల్‌టికెట్లు విడుదల చేయకపోవడంతో అభ్యర్థులలో ఆందోళన నెలకొంది. మే 20 నుంచి జూన్ 2 వరకు తెలంగాణలో టెట్ నిర్వహించనున్నారు. ఫలితాలను జూన్ 12న వెల్లడిస్తారు.
ఇందులో అర్హత సాధించిన వారు డీఎస్సీ రాసేందుకు వీలు ఉంటుంది. రాష్ట్రంలో తొలిసారిఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో టెట్ నిర్వహిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఈఏడాది టెట్ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 48,582 మంది సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు.