మోదీకి, ఎన్డీయేకు అభినందనలు

మోదీకి, ఎన్డీయేకు అభినందనలు
  •  అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్
  • ఇండియాతో కలిసి పని చేస్తామన్న చైనా
  • ప్రధాని మోదీకి ప్రపంచ దేశాల విషెస్

న్యూఢిల్లీ: ‘చరిత్రాత్మక ఎన్నికల్లో గెలిచిన నరేంద్ర మోదీకి, ఎన్డీయేకు అభినందనలు.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మన రెండు దేశాల మధ్య స్నేహం నిరంతరం పెరుగుతూనే ఉండాలి’ అంటూ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ట్వీట్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ప్రధాని మోదీకి ప్రపంచ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. 50 దేశాలకు పైగా లీడర్లు విషెస్​ తెలియజేస్తూ సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టులు పెట్టారు.

 చైనా కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపింది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇండియాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ‘‘ప్రజల ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు ఇండియాతో కలిసి పనిచేస్తం” అని ఆమె తెలిపారు.  

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు, శ్రీలంక, ఇరాన్, సీషెల్స్, నైజీరియా, కెన్యా, సౌత్ కొరియా అధ్యక్షులు, ఇటలీ, జపాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, మారిషస్, మలేసియా ప్రధానులు, జమైకా, బార్బడోస్, గయానా దేశాల అధినేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.