ఫారిన్‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌లో సెబీ చీఫ్‌‌‌‌‌‌‌‌ పెట్టుబడులు?

మాధవీ పురి బచ్‌‌‌‌‌‌‌‌పై  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఆరోపణలు

న్యూఢిల్లీ: సెబీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ మాధవి పురి బచ్‌‌‌‌‌‌‌‌ తాను పదవిలో ఉంటూనే లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని కాంగ్రెస్ ఆరోపించింది. చైనాతో సహా వివిధ ఫారిన్‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌లో కూడా పెట్టుబడులు పెట్టారని పేర్కొంది. 

సెబీలో హోల్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, ఆ తర్వాత చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తూనే 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌017–2023 మధ్య రూ.36.9 కోట్ల విలువైన లిస్టెడ్ కంపెనీల షేర్లను ట్రేడ్ చేశారని  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ స్పోక్స్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ పవన్  ఖేరా  అన్నారు. 

సెబీ కోడ్ ఆఫ్ కండక్ట్‌‌‌‌‌‌‌‌లోని సెక్షన్‌‌‌‌‌‌‌‌ 6 కి ఇది విరుద్ధమని అన్నారు. 2017–2021 మధ్య మాధవి  ఫారిన్ అసెట్స్‌‌‌‌‌‌‌‌ను హోల్డ్ చేశారని  ఆరోపించారు. వాంగార్డ్‌‌‌‌‌‌‌‌ టోటల్ స్టాక్ మార్కెట్ ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌, ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఇన్నోవేషన్ ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌, గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ ఎంఎస్‌‌‌‌‌‌‌‌సీఐ చైనా కన్జూమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 

ఇన్వెస్కో చైనా టెక్నాలజీ ఫండ్స్‌‌‌‌‌‌‌‌లో 2021–2024 మధ్య ఆమె ఇన్వెస్ట్ చేశారని కాంగ్రెస్ పేర్కొంది.