
మంచిర్యాల జిల్లాలో సీఎం రేవంత్, ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణకు పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నేతలు. క్యాతనపల్లి ROB నిర్మాణ పనులు పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు నేతలు.
2014 లో వివేక్ వెంకటస్వామి ఎంపీగా ఉన్నపుడు క్యాతనపల్లి ROB నిర్మాణ పనులకు అనుమతులు తీసుకువచ్చి పనులను ప్రారంబించారు. రూ.32 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి పనులను బిఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన బాల్క సుమన్ 10 ఏండ్లు పట్టించుకోలేదు. చెన్నూరు ఎమ్మెల్యే గా వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ లు గెలిచిన వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనుల పై దృష్టి పెట్టి అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో 12 ఏండ్ల కష్టాలు తొలగిపోనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు స్థానికులు. బ్రిడ్జి నిర్మాణంలో భూముల కోల్పోయిన రైతులకు పరిహారం అందించి ROB పనులను పూర్తి చేసి రామకృష్ణపూర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినందుకు ఎమ్మెల్యే వివేక్,ఎంపీ వంశీ కృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.