కాంగ్రెస్ నాయకుల ఆందోళన.. హుస్నాబాద్ లో ఉద్రిక్తత

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో ఉద్రిక్తత ఏర్పడింది. బండి సంజయ్  ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు. అటు బీజేపీ కార్యకర్తలు భారీగా రావడంతో టెన్షన్ నెలకొంది. ఘర్షణలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. కాంగ్రెస్ కార్యకర్తలను ప్రజాహిత యాత్ర క్యాంప్ వైపు రాకుండా అడ్డుకుంటున్నారు. 

మంత్రి పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ వివాదాస్పద కామెంట్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. దీనిపై ఇప్పటికే హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరోవైపు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామ శివారులో.. హుస్నాబాద్ మండలం రాములపల్లిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు కాంగ్రెస్ కార్యకర్తుల, నేతలు. బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ALSO READ : లోక్​సభ ఎలక్షన్​లో బీఆర్ఎస్​ ఒక్క సీటు గెలవదు : మహేశ్​గౌడ్