హ్యదరాబాద్ లోని గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. అదానీ మెగా కుంభకోణంపై విచారణకు డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగారు కాంగ్రెస్ నేతలు. మంత్రులు తుమ్మల, పొన్నం, ఎంపీలు మల్లు రవి, పెద్దపల్లి ఎంపీ గడ్డంవంశీకృష్ణ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, దానం, జయవీర్ రెడ్డి, ఆందోళనల్లో పాల్గొన్నారు.
సెబీ చైర్మన్ అక్రమాలపై విచారణకు JPC కమిటీ వేయాలని నినాదాలు చేశారు. కాసేపట్లో గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లనున్నారు కాంగ్రెస్ నేతలు.ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్సీ హాజరుకానున్నారని సమాచారం.