కామారెడ్డి, వెలుగు: పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు కొండల్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ స్కీమ్‌లను అమలు చేస్తామన్నారు. సోమవారం కామారెడ్డి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. రామారెడ్డి మండలం మద్దికుట బుగ్గరామలింగేశ్వర ఆలయంలో కొండల్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మాచారెడ్డి మండలం చుక్కాపూర్, లక్ష్మీరావులపల్లిల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కొండల్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు, రైతులు, యువత అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్అధికారంలోకి రాగానే రూ.500 సిలిండర్ ఇస్తామన్నారు. మహిళలకు ప్రతినెల రూ.2,500 ఇస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి మేనిఫెస్టో ప్రకటించినట్లు గుర్తుచేశారు. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు లీడర్లు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. బీబీపేట ఉప సర్పంచ్ సాయినాథ్, బీజేపీ మాజీ మండలాధ్యక్షుడు నరేందర్ తదితరులు మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, ఎన్ఎస్ యూఐ ఇన్చార్జి రిజ్వాన్, కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
బస్వాపూర్ నుంచి జనగామ వరకు ర్యాలీ
బీబీపేట మండలం జనగామకు చెందిన వ్యాపారవేత్త వేణుగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీలో చేరిన సందర్భంగా భిక్కనూరు మండలం బస్వాపూర్‌నుంచి జనగామ వరకు ర్యాలీ నిర్వహించారు. వీరికి భిక్కనూరులో కాంగ్రెస్మహిళా విభాగం స్టేట్ మాజీ ప్రెసిడెంట్ నేరేళ్ల శారద, పీసీసీ స్టేట్సెక్రెటరీ ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ వైస్‌ప్రెసిడెంట్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం జనగామలో నిర్వహించిన మీటింగ్‌లో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారన్నారు.