కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు

కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు
  • చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఘటన

చండీగఢ్: కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గత వారం రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా బీఆర్ అంబేద్కర్‌‌పై చేసిన వ్యాఖ్యలకు గాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, ఆమ్​ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్లు కౌన్సిలర్లు తీర్మానం చేసి ఆమోదించారు. అయితే, జవహర్‌‌లాల్ నెహ్రూ హయాంలోనూ అంబేద్కర్‌‌ను కించపరిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. 

ఇది కాంగ్రెస్​, బీజేపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. అలాగే, నామినేటెడ్‌‌ కౌన్సిలర్‌‌ అనిల్‌‌ మసీహ్‌‌ను కొందరు కాంగ్రెస్‌‌, ఆప్‌‌ నేతలు ‘ఓటు దొంగ’ అనడంతో గొడవ తీవ్రమైంది. అనంతరం దాదాపు 20 నిమిషాల పాటు రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో మసీహ్‌‌ ట్యాంపరింగ్‌‌కు పాల్పడ్డారని కాంగ్రెస్​కౌన్సిర్లు ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్‌‌పై బయట ఉన్నారని మసీహ్ కౌంటర్​ ఇచ్చారు.