కాంగ్రెస్‌, బీజేపీలకు డిపాజిట్లు దక్కవు: హరీశ్

కాంగ్రెస్‌, బీజేపీలకు డిపాజిట్లు దక్కవు: హరీశ్

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌,బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు ఎమ్మెల్యే హరీశ్‌ రావు. నర్సాపూర్‌లో మెదక్‌ TRS ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌ షోలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్… కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరం ద్వారా నర్సాపూర్‌ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని స్పష్టం చేశారు. బస్సు డిపోను ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ఓట్లు వేస్తే మురికి కాలువలో వేసినట్లేనన్నారు హరీశ్ రావు.