కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల ఘర్షణ

కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల ఘర్షణ
  • ఇరువర్గాలపై కేసు 

పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్​నాయకులు ఘర్షణ పడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం తుంకుల గడ్డ హోటల్ లో రెండు పార్టీలకు చెందినవారు దుర్భాషలాడుకున్నారు. వారి మద్దతుదారులు అక్కడికి చేరుకోవడంతో గొడవ పెద్దదైంది. 

కాంగ్రెస్ నాయకుడు మధు, బీఆర్ఎస్ నాయకుడు శ్రీను సోమవారం సాయంత్రం పరిగి పోలీస్ స్టేషన్ సమీపంలోని చాయ్ అడ్డా  వద్ద మాట్లాడుతుండగా.. ఇరువర్గాలవారు కూల్ డ్రింక్ సీసాలు, కుర్చీలతో దాడి చేసుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, వారిని చెదరగొట్టారు. రెండు పార్టీలకు చెందిన పలువురికి గాయాలైనట్లు తెలిపారు. కాంగ్రెస్​చెందిన 20 మంది, బీఆర్ఎస్​కు చెందిన20 మందిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.