
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్పరిధిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ కొనసాగుతున్నది. తాజాగా ఒకే పనిని ఆ పార్టీల నేతలు వేర్వేరుగా ప్రారంభోత్సవం చేయడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీతాఫల్మండి డివిజన్ భవానీనగర్‌లో రూ 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పద్మారావుగౌడ్, కార్పొరేటర్ సామల హేమ కలిసి సోమవారం ప్రారంభించారు.
కొంతసేపటి తర్వాత అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు అదే ప్రాంతంలో కొబ్బరికాయలు కొట్టి రెండోసారి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ఇన్ చార్జీ ఆదం సంతోష్‌కుమార్ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరు చేయించినట్లు కాంగ్రెస్ నేత మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి పేర్కొన్నారు.