కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ

కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ రాక ఆలస్యం కావడంతో.. ప్రోటోకాల్ పాటించకుండా జగ్జీవన్ విగ్రహానికి ముందుగానే పూలమాల వేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.

ఈ క్రమంలో అధికారిక కార్యక్రమంలో మంత్రి, కలెక్టర్ కంటే ముందు ఎలా దండ వేస్తారంటూ అభ్యంతరం తెలిపారు బీఆర్ఎస్ నేతలు. దీంతో ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి తోపులాట జరిగింది. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను అడ్డుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు.