కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ పార్టీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. పేదల కోసం ప్రదాని మోడీ కష్టపడుతున్నారన్నారంటూ.. ఆయన కూడా పేద వ్యక్తే నన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ , కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాసయోజన పథకంలో మూడు కోట్ల మందికి కేంద్రం ఇళ్లు కట్టించిదన్నారు. తెలంగాణకు 2 లక్షల 30 వేల ఇండ్లను ప్రధాని మోడీ మంజూరు చేశారని వాటిని కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ నిర్మించందో కూడా తెలియదంటూ.. వీటిపై ఎంపీ, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలన్నారు. గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పైపులు ప్రతి ఏటా పగులుతున్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చి కోట్లాది మంది పేదలను ప్రధాని మోడీ కాపాడారని బండి సంజయ్ అన్నారు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ డబ్బులు పంపించారన్నారు బండి సంజయ్.
ALSO READ: తెలంగాణలో యూకే టెక్నాలజీ సెంటర్ .. తొలి విడతలో 600 మందికి ఉపాధి
అంతకుముందు... దండెపల్లి మండలం గూడెం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామికి మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గూడెం నుండి లక్షెట్టిపేట వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. లక్షెట్టిపేటలో అంబేద్కర్ విగ్రహానికి బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, రఘునాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇక్కడ బండి సంజయ్, వివేక్ వెంకటస్వామికి బీజేపీ కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. లక్షెట్టిపేట జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ బహిరంగ సభ నిర్వహించారు.
ALSO READ: తెలంగాణలో బీఆర్ఎస్ గుండాగిరి నడుస్తోంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్