- మీడియా సమావేశంలో కాంగ్రెస్, సీపీఐ లీడర్లు
కోల్బెల్ట్, వెలుగు: ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామితోనే చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్, సీపీఐ లీడర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. వివేక్ వెంకటస్వామి విజయం సాధించడాన్ని పురస్కరించుకొని సోమవారం రామకృష్ణాపూర్లోని కాంగ్రెస్ ఆఫీస్లో కాంగ్రెస్, సీపీఐ లీడర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామిని గెలిపించినందుకు ప్రజల రుణాన్ని అభివృద్ధి రూపంలో తీర్చుకుంటారన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ ఆయనకు సహకరించాలని కోరారు. బాల్క సుమన్ అవినీతి, అహంకార పాలనకు ప్రజలు చరమగీతం పాడి గట్టి బుద్ది చెప్పారన్నారు. కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామిని గెలిపించారన్నారు. వామపక్షాలు కూడా మద్దతుగా నిలిచాయన్నారు.
మందమర్రి, రామకృష్ణాపూర్లో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు, 45వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివేక్ వెంకటస్వామి కట్టుబడి ఉన్నారన్నారు. క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద ఆర్వోబీ నిర్మించి అందుబాటులోకి తీసుకరానున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన పేదలకు 286 డబుల్బెడ్రూమ్ ఇండ్లను ఇప్పించేందుకు కృషి చేస్తారన్నారు. సమావేశంలో కాంగ్రెస్ లీడర్లు రాఘునాథ్రెడ్డి, పల్లెరాజు, ఎండి.అబ్దుల్అజీజ్, మహంకాళీ శ్రీనివాస్, గోపతి రాజయ్య, యాకుబ్ అలీ, చంద్రగిరి ఎల్లయ్య, రాజేశ్, ఆకుల రాజన్న, సత్యపాల్, మెట్టె సుధాకర్, సీపీఐ లీడర్లు మిట్టపెల్లి శ్రీణివాస్, వనం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.