మునుగోడు బై పోల్ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించిన కాంగ్రెస్

మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మునుగోడులో ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల లిస్టు ప్రకటించారు. 38 మంది నేతలు పేర్లతో కూడిన జాబితాను పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విడుదల చేసింది. మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. 

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఉండటం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం జోరందుకున్నా ఇప్పటికీ ఆయన ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు.  ప్రచారానికి  దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం. ఈ నెల 15న ఆస్ట్రేలియా వెళ్లనున్న ఆయన మునుగోడు ఎన్నిక పూర్తైన తర్వాత తిరిగి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.