అయోధ్యలో యువతిపై హత్యాచారం.. ప్రెస్​మీట్‎లోనే బోరున ఏడ్చిన ఎంపీ

అయోధ్యలో యువతిపై హత్యాచారం.. ప్రెస్​మీట్‎లోనే బోరున ఏడ్చిన ఎంపీ

అయోధ్య: కనిపించకుండాపోయిన యువతి మృతదేహం దారుణ స్థితిలో బయటపడిన ఘటనపై అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మీడియాతో మాట్లాడుతూనే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెపై అత్యాచారం చేసి, దారుణంగా చంపేశారని బోరున విలపించారు. మూడ్రోజులుగా కనిపించకుండాపోయిన ఆ యువతిని కాపాడుకోలేకపోయామని, రేప్ చేసి చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడుతానని అన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.

 ఇదంతా చెప్తూనే ఆయన ‘హే భగవాన్.. రామ్.. సీతా ఎక్కడున్నారు..? ఆడబిడ్డలపై ఇంతటి ఘోరాలా..?’ అంటూ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. దీంతో పార్టీ నేతలు ఆయనను సముదాయించారు. ‘‘ఆడబిడ్డలను కాపాడుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం. ఈ ఘటనపై ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుస్తా. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేదాకా కొట్లాడ్త” అని ఎంపీ పేర్కొన్నారు.