కేరళలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఇవాళ్టికి ఈ యాత్ర పదకొండో రోజుకు చేరుకుంది. ఇవాళ కేరళలో అలప్పుజాలోని హరిపాడ్ దగ్గర పాదయాత్ర ప్రారంభమైంది. ఈ నెల 16న కొల్లాం జిల్లాలో రెస్ట్ తీసుకున్న కాంగ్రెస్ నేతలు.. నిన్న అలప్పుజా చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సరిహద్దులో నేతలకు ఘన స్వాగతం పలికారు.
మొత్తం 19 రోజులపాటు కేరళలో జోడో యాత్ర జరగనుంది. అలప్పుజా తర్వాత ఈ నెల 21, 22న ఎర్నాకులం, ఈనెల 23న రాహుల్ పాదయాత్ర త్రిసూర్ చేరుకుంటుంది . కేరళలోని 7 జిల్లాల్లో పాదయాత్ర చేయనున్నారు. అక్టోబర్ 1న కర్ణాటకలోకి యాత్ర ప్రవేశించనుంది.
Congress' Bharat Jodo Yatra led by Rahul Gandhi enters its 11th day
— ANI Digital (@ani_digital) September 18, 2022
Read @ANI Story | https://t.co/qLk9P3BbRq#Congress #RahulGandhi #BharatJodoYatra pic.twitter.com/go5yloaEFn