- కాంగ్రెస్ భువనగిరి అభ్యర్థి కుంభం
యాదాద్రి, వెలుగు : తనను గెలిపిస్తే పేద ప్రజల అభ్యున్నతి కోసమే పనిచేస్తానని కాంగ్రెస్భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం నియోజకవర్గంలోని భువనగిరి మున్సిపాలిటీ, బీబీనగర్ మండలాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో కలిగే లబ్ధిని ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
ఇప్పటివరకూ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఏండ్లు గడుస్తున్నా వితంతు పింఛన్లు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. అనంతరం చీమలకొండూరు సర్పంచ్ జీలుగు కవిత, ఉప సర్పంచ్ పల్లెర్ల నర్సింహా, బీబీనగర్ మాజీ ఎంపీటీసీ బింగి శ్రీనివాస్ సహా వందల సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లోచేరారు.