ఆప్​పై ఉమ్మడిగా పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించండి.. బీజేపీ, కాంగ్రెస్​కు కేజ్రీవాల్ సవాల్

ఆప్​పై ఉమ్మడిగా పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించండి.. బీజేపీ, కాంగ్రెస్​కు కేజ్రీవాల్ సవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పై ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)చీఫ్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్​ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని మండిపడ్డారు. 

ఆప్ పై ఉమ్మడిగా పోటీ చేస్తామని ఆ రెండు పార్టీలు అధికారికంగా ప్రకటించాలని సవాల్ విసిరారు.  పంజాబ్‌‌‌‌‌‌‌‌లోని ఆప్  ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడం లేదని ఆరోపిస్తూ ఆ రాష్ట్రానికి చెందిన కొందరు మహిళలు.. ఢిల్లీలోని కేజ్రీవాల్ ఇంటి ఎదుట నిరసన తెలిపారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.." కాంగ్రెస్, బీజేపీ రెండూ కావాలనే కూటమిగా ఏర్పడి మాపై దాడి చేస్తున్నాయి.  

మా ఇంటి ముందు నిరసన చేసిన మహిళలు వారి పార్టీలకు చెందినవారే. వారు పంజాబ్ నుంచి రాలేదు. ఆ రాష్ట్ర ప్రజల మద్దతు మాకే ఉంది" అని కేజ్రీవాల్​ పేర్కొన్నారు.