నల్గొండ, వెలుగు: మదర్ డెయిరీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. కాంగ్రెస్ తన ఓటర్లను క్యాంపునకు తరలించింది. బీఆర్ఎస్ ఓటర్లు గల్లీలో తిరుగుతున్నారు. ఈనెల13న డెయిరీ డైరెక్టర్ల ఎన్నికల నేపథ్యంలో క్రాస్ఓటింగ్కీలకంగా మారడంతో ఓటర్లు చేజారిపోకుండా ఇరువర్గాలు జాగ్రత్త పడుతున్నాయి. కాంగ్రెస్దాదాపు150 మంది ఓటర్లను హైదరాబాద్సమీపంలోని బొంగుళూరు గేట్‌వద్ద ఓ ఫంక్షన్‌హాల్‌కు తరలించి క్యాంపు పెట్టింది.
మెజార్టీ ఓటర్లు కాంగ్రెస్‌కే ఉన్నప్పటికీ ఎన్నికల ఇన్చార్జిగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య రంగారెడ్డి జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో 4 డైరెక్టర్ సీట్లను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ ఓటర్లతో పాటు, బీజేపీ, కమ్యూనిస్టు మద్దతుదారులు మరో 30 నుంచి40 మంది వరకు ఉండగా.. వారిని కూడా క్యాంపునకు రప్పించేందుకు చర్చలు జరుపుతున్నారు. డెయిరీ పాలిటిక్స్‌లో అనుభవం కలిగిన డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగడి మహేందర్‌రెడ్డి డీసీసీబీ చైర్మన్పదవి పోయిన తర్వాత ఆలేరులో తన రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు ఒంటరి పోరు చేస్తున్నారు.