
- రోడ్డు పనుల ప్రారంభోత్సవంలో ఇరువర్గాల తోపులాట
శివ్వంపేట, వెలుగు: మండలంలోని లచ్చిరెడ్డి గూడెంలో రూ.17 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులను బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్చిలుముల సుహాసిని రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డితో కలిసి ప్రారంభించారు. కాగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి లేకుండా సీసీ రోడ్డు పనులను ఎలా ప్రారంభిస్తారని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నేతలతో గొడవకు దిగారు.
దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజిరెడ్డి ముందుగా సీసీ రోడ్డు పనుల ప్రారంభానికి గ్రామ పెద్దలు కొబ్బరికాయ కొట్టాలన్నారు. అక్కడున్న గ్రామస్తులు మీరే కొబ్బరి కాయ కొట్టాలని సుహాసిని రెడ్డి, రాజిరెడ్డిని కోరారు. దీంతో వారు కొబ్బరి కాయ కొట్టి పనులు ప్రారంభించారు. అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, నవాపేట్ మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి అభ్యంతరం తెలిపారు.
జై రేవంత్ రెడ్డి అంటూ కాంగ్రెస్ నాయకులు, జై కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ నాయకులు పోటీ పోటీగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాం రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నవీన్ గుప్తా, మాధవరెడ్డి, నరసింహారెడ్డి, లక్ష్మీకాంతం, సుధీర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కమలా, పూల్ సింగ్, సురేందర్ రెడ్డి, గణేశ్, రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.