ముషీరాబాద్, వెలుగు: బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ను మంగళవారం అంబర్‌పేటలో కాంగ్రెస్శ్రేణులు అడ్డుకున్నాయి. మూసీ పరివాహక ప్రాంతవాసులను కలిసి వెళ్తున్న ఆయనను శంకర్ మఠ్ చౌరస్తాలో యువజన కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడు రోహిత్ ఆధ్వర్యంలో అడ్డగించాయి. కేటీఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. మంత్రి కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశాయి. కాన్వాయ్‌ను చుట్టుముట్టడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు చేరుకుని కాంగ్రెస్ శ్రేణులను పక్కకు తప్పించి, కేటీఆర్కాన్వాయ్ పంపించారు.
రోహిత్ మాట్లాడుతూ.. మంత్రి కొండా సురేఖను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ భవన్ వద్ద నిరసనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులను కేటీఆర్ అనుచరులు దాడులు చేశారని మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చేప్పేవరకు నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. అలాగే కేటీఆర్ కారును గోల్నాక నుంచి కాంగ్రెస్ నేతలు బైకులపై వెంబడించారు.