పహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం..పాకిస్తానే సూత్రధారి.. భద్రతా వైఫల్యం ఉంది

పహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం..పాకిస్తానే సూత్రధారి.. భద్రతా వైఫల్యం ఉంది

పహల్గాం ఉగ్రదాడికి పాకిస్తానే సూత్రధారి అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆరోపించింది. ఉగ్రవాదులు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు హిందువులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుందని ఈ దాడులను ఖండిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) గురువారం (ఏప్రిల్ 24) ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ఘటనలో భద్రతా లోపం కూడా ఉందని, ఐక్యంగా ఇటువంటి దాడులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. 

పాకిస్తాన్  రూపొందించిన ఈ పిరికి పంద చర్య, ఉగ్రవాద చర్చ భారత దేశ గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి అని సీడబ్లూ్సీ పేర్కొంది. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు హిందువులను లక్ష్యంగా చేసుకుందని పార్టీ తీర్మానం తెలిపింది. 

కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి ఘోరంగా విఫలమైన భద్రతా వైఫల్యానికి, నిఘా లోపాలకు నిదర్శనం అని అన్నారు. 
కేంద్ర హోంశాఖ పరిధిలోని కేంద్ర పాలిత ప్రాంతంలో అటువంటి దాడికి దారితీసిని నిఘా వైఫల్యాలు, భద్రతా లోపాలపై సమగ్ర విశ్లేషణ అత్యవసరం అన్నారు. 

Also Read:-టూరిస్టులకోసం ..కాశ్మీర్ (కత్రా)నుంచి ఢిల్లీకి స్పెషల్ ట్రైన్..

అమర్‌నాథ్ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది.లక్షలాది మంది యాత్రికులు తీర్థయాత్రలో పాల్గొంటారు. కేంద్రం వెంటనే వారి భద్రతను జాతీయ ప్రాధాన్యతగా పరిగణించాలని CWC పేర్కొంది. ఎటువంటి ఆలస్యం లేకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని సీడబ్ల్యూ సీ కేంద్ర హోంశాఖను కోరింది.

 యాత్రికుల భద్రతతోపాటు జమ్మూ కాశ్మీర్ ప్రజల జీవనోపాధి పర్యాటకంపై ఆధారపడి ఉంది. పూర్తి చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని CWC తీర్మానం చేసింది.