కేసీఆర్​ మిడ్‌‌‌‌మానేరు నిర్వాసితులను మోసం చేసిండు : ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు : మిడ్​మానేరు ప్రాజెక్ట్​ముంపు గ్రామాల సమస్యలు నెరవేర్చుతానని మాటిచ్చి సీఎం కేసీఆర్​మోసం చేశారని వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం వేములవాడ అర్బన్, కోనరావుపేట మండలాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​మాట్లాడుతూ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన ప్రజలకు కేసీఆర్​సర్కార్​సరైన నష్టపరిహారం ఇవ్వకపోగా, వారిపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేసిందని మండిపడ్డారు.

ప్రజల బాధలు దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, నాలుగుసార్లు ఓడిపోయినా తాను ప్రజల మధ్యనే ఉన్నానన్నారు. 30న జరగబోయే ఎన్నికల్లో ప్రజలు చేతి గుర్తుపై ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు 17వ వార్డు కౌన్సిలర్​వంగల దివ్య శ్రీనివాస్ బీఆర్ఎస్‌‌‌‌కు ​రాజీనామా చేసి కాంగ్రెస్‌‌‌‌లో చేరారు.

ALSO READ : అధికారంలోకి రాగానే జీవో 69ని అమలు చేస్తాం : ఈటల రాజేందర్

ఈ సందర్భంగా కౌన్సిలర్​మాట్లాడుతూ బీఆర్ఎస్‌‌‌‌లో ఉద్యమకారులకు గుర్తింపు లేదన్నారు. కార్యక్రమంలో అర్బన్​మండల అధ్యక్షుడు పిల్లి కనుకయ్య, కదిరె రాజ్‌‌‌‌కుమార్​, పండుగ ప్రదీప్​, శ్రీనివాస్​, ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సత్తయ్య పాల్గొన్నారు.