వేములవాడ, వెలుగు : ‘నేను ఇక్కడే పుట్టిన..ఇక్కడే పెరిగిన..నా కట్టె కాలే వరకూ మీతోనే ఉంటా..’ తన భవిష్యత్ మీచేతిలో పెట్టానని ఒక్కసారి అవకాశం కల్పించి తనను గెలిపించాలని వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అభ్యర్థించారు. గురువారం తన సొంత గ్రామం రుద్రంగి మండల కేంద్రంలో, చందుర్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నాలుగుసార్లు ఓడిపోయానని ఈసారి తనకు అవకాశం కల్పించమని ప్రాధేయపడ్డారు.
బీఆర్ఎస్,బీజేపీ అభ్యర్థులు స్థానికులు కాదని, ఎన్నికలప్పుడే వస్తారని ఆరోపించారు. చుట్టపుచూపు తీరుగా వచ్చేటోళ్లని నమ్మితే మోసపోతామన్నారు. సొంత గ్రామంలో ఒక్క ఓటు పోకుండా తనకు ఓటేసి గెలిపించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్ పాల్గొన్నారు.
దొరలను రాజకీయంగా బొంద పెట్టాలి
వేములవాడరూరల్, వెలుగు : వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటివరకు చేసిన మూడు సర్వేల్లో ఆది శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలుస్తున్నాడని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్తీన్మార్మల్లన్న అన్నారు. వేములవాడ రూరల్‌మండలం ఫాజుల్‌నగర్, వట్టెంల గ్రామాల్లఆది శ్రీనివాస్‌తో కలిసి ఆయనకు మద్దతుగా మల్లన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ALSO READ : జగిత్యాల జిల్లాలో ప్రారంభమైన హోమ్ ఓటింగ్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆడ బిడ్డలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన చరిత్ర దొరలదని, వేములవాడ ప్రజలు ఈ దొరలను రాజకీయంగా 100 అడుగుల లోతులో బొంద పెట్టాలన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దొరలపాలైందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రంగు వెంకటేశ్, సంగ స్వామి, వకుళాభరణం శ్రీనివాస్, మోహన్, ముస్కు పద్మ, తదితరులు పాల్గొన్నారు.