- కారులో వచ్చి ప్లెక్సీలను చింపేసిన దుండగులు
- సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
- పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ లీడర్ల ఫిర్యాదు
వేములవాడ, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్అభ్యర్థి ఆది శ్రీనివాస్ ప్రచార వాహనంపై బుధవారం దాడి జరిగింది. నంబర్ ప్లేట్ లేని కారులో వచ్చిన దుండగులు వేములవాడ అర్భన్ మండలం గుర్రవానిపల్లె వద్ద ఆది శ్రీనివాస్ ప్రచార రథాన్ని అడ్డుకున్నారు. వాహనంపై ఉన్న ఆది శ్రీనివాస్ ఫ్లెక్సీలను చింపివేశారు. డ్రైవర్అడ్డుకునే ప్రయత్నం చేసే క్రమంలో నెట్టేసి కారులో పారిపోయారు.
‘మీ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఎట్లా గెలుస్తడో చూస్తం రా’ అని బెదిరించినట్లు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు పెద్ద సంఖ్యలో వేములవాడ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని సీఐ కరుణాకర్‌కు
ఫిర్యాదు చేశారు.