బీఆర్ఎస్ పాలనలో ఎవరూ బాగుపడలే : ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో ఊరుకొక్కరే బాగుపడ్డారని, బడుగు, బలహీన వర్గాలను, దళితులను, మహిళలను ప్రభుత్వం పట్టించుకోలేదని వేములవాడ కాంగ్రెస్​ అభ్యర్థి ఆది శ్రీనివాస్​ ఆరోపించారు. సోమవారం కోనరావుపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

 కాంగ్రెస్ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతుందన్నారు.  ఉద్యమాన్ని గౌరవించి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ రెండు సార్లు గెలిచి ప్రజలను మోసం చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేపర్ లీకేజీలకు పాల్పడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. కోనరావుపేట మండల కేంద్రంతోపాటు శివంగలపల్లి, ఎగ్లాస్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మల్కపేట, ధర్మారం పలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రచారం నిర్వహించారు.