తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫలితాల్లో కాంగ్రెస్ బోణి కొట్టింది. ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించారు. ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చనాగేశ్వర్ రావుపై 23,358 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరో వైపు కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే మెజారిటీ స్థానాలను దాటేసింది.
మరో వైపు గజ్వేల్ లో కేసీఆర్, కామారెడ్డి, కొడంగల్ లో రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఈటల రాజేందర్ రెండు చోట్ల వెనుకంజలో ఉన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్, కోరుట్ల అర్వింద్ వెనుకంజలో ఉన్నారు. ఇక ఆరుగురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు,నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ వెనుకంజలో ఉన్నారు.