వేములవాడ వైస్ ఎంపీపీగా కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ వైస్ ఎంపీపీగా వనపర్తి దేవరాజ్ కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్ సమక్షంలో వైస్ ఎంపీపీ ఎన్నిక జరిగింది. వేములవాడ అర్బన్ వైఎస్ ఎంపీపీ ఆర్సీ రావు (బీఅర్ఎస్) కొద్ది రోజుల క్రితం తన వ్యక్తి గత కారణాలతో రాజీనామా చేశారు.

మెజారిటీ సభ్యుల ఆమోదంతో వైస్ ఎంపీపీగా దేవరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే మొత్తం ఆరుగురు ఎంపిటీసీలలో ఇద్దరు కాంగ్రెస్, ఒకరు బీజేపీ, మరొకరు ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు పలికారు.