మోసపూరిత హామీలు నమ్మొద్దు : దొంతి మాధవరెడ్డి

నల్లబెల్లి/నర్సంపేట, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను గెలిపిస్తే నర్సంపేటను అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ దొంతి మాధవరెడ్డి చెప్పారు. వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా దుగ్గొండి మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్న మోసపూరిత హామీలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు.

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అంతకుముందు నల్లబెల్లి, దుగ్గొండి మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, రమేశ్‌‌‌‌‌‌‌‌, నర్సింగరావు, రవి, అశోక్,​ చరణ్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

ALSO READ : పువ్వాడ వయ్యారి భామ లాంటి పువ్వు.. పూజకు పనికి రాని పువ్వు : తుమ్మల 

అలాగే నర్సంపేట పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు కందగట్ట నాగరాజు ఆధ్వర్యంలో పలువురు మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. కార్యక్రమంలో పాలాయి శ్రీనివాస్, ఓర్సు తిరుపతి, బైరి మురళి, సూరి, శివకుమార్, వీరభద్రాచారి పాల్గొన్నారు.