
రేగోడ్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారుల కుటుంబాలను విస్మరించిందని, వారికి రాజకీయంగా సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఆందోల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గురువారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తమ అనుచురులతో కలిసి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన తమకు బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు.
మధ్యలో వచ్చిన వారికి పదవులు, ప్రభుత్వ పథకాలు కట్టబెట్టిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్‌ను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్‌లో చేరినవారిలో సంగారెడ్డి, శ్రీనివాస్, జయరావ్, అంజయ్య, లక్ష్మణ్ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు కిషన్, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ యాదగిరి, రాజేందర్ పాటిల్, కోఆప్షన్ మెంబర్ చోటు మియా, మల్లేశం, , జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.