నేతకానిలకు న్యాయం చేయని .. దుర్గం చిన్నయ్యను ఓడిస్తం

  • కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తం
  • నేతకాని మహర్ హక్కుల సంఘం నేతల స్పష్టీకరణ

బెల్లంపల్లి, వెలుగు : రెండుసార్లు బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అగ్రకులాల పంచన చేరి నేతకానిలకు న్యాయం చేయని దుర్గం చిన్నయ్యను ఎన్నికల్లో ఓడిస్తామని నేతకాని మహర్ హక్కుల సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో హక్కుల సంఘం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ దుర్గం గోపాల్, నేతకాని యూత్ రాష్ట్ర అధ్యక్షుడు గొమాస శ్రీకాంత్, సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్ మీడియాతో మాట్లాడారు.

స్థానిక నేతకాని సంఘం నాయకులను కాకుండా దుర్గం చిన్నయ్య ఇతర ప్రాంతాల నుంచి బంధువులను తీసుకొచ్చి నేతకాని సంఘం పేరుతో తప్పుడు ప్రకటనలు ఇప్పిస్తున్నాడని ఫైర్ అయ్యారు. బెల్లంపల్లిలో పెట్టేది నేతకానిల సింహ గర్జన సభ కాదని, అది నేతకానిల నయ వంచన సభ అని ఫైర్​అయ్యారు. ఎన్టీపీసీలో పనిచేస్తున్న బండారి కనకయ్య తమపై తప్పుడు ప్రకటనలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు  ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

ALSO READ : కొత్తగూడెం అభివృద్ధి బీఆర్​ఎస్​తోనే సాధ్యం : వనమా వెంకటేశ్వరరావు

కాంగ్రెస్​హయాంతో నేతకాని కులానికి సముచిత స్థానం దక్కిందన్నారు. తరతరాలుగా ప్రజల కోసం దివంగత గడ్డం వెంకటస్వామి కుటుంబం పనిచేస్తోందని తెలిపారు. వెంకటస్వామి కొడుకు, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ కు మద్దతు తెలుపుతున్నామని, భారీ మెజారిటీతో గెలిపించి తీరుతామని వెల్లడించారు.