- కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ
రామగిరి, వెలుగు: పార్లమెంట్ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదిస్తే.. పెద్దపల్లిని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కోరారు. సోమవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో కాంగ్రెస్ లీడర్దుద్దిళ్ల శ్రీనుబాబుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబమంతా ప్రజాసేవకే అంకితమైందన్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంతో తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని, ఈ ప్రాంత ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులే అని పేర్కొన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉండగా.. ప్రత్యర్థి పార్టీల లీడర్లు తనకు అనుభవం లేదని విమర్శించడంపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఆయన వెంట లీడర్లు తొట్ల తిరుపతియాదవ్, ఆరెల్లి దేవక్క, రొడ్డ బాపన్న, వనం రాంచందర్రావు, కొలిపాక సారయ్య పాల్గొన్నారు.
వంశీకృష్ణ వాహనం తనిఖీ
గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కారును సోమవారం పోలీసులు చెక్ చేశారు. గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జి వద్దనున్న చెక్పోస్ట్ వద్ద పోలీసులు ఆయన కారును ఆపి తనిఖీలు చేశారు. పోలీసులకు వంశీ పూర్తిగా సహకరించారు. ఆయన వెహికల్తో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను కూడా చెక్ చేశారు.