బెల్లంపల్లి రూరల్,వెలుగు: రాష్ట్రాన్ని నాశనం చేస్తూ.. కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు లక్షల కోట్లు దోచుకుంటున్నారని, బీఆర్ఎస్ పాలనను అంతం చేస్తేనే రాష్ట్రానికి మనుగడ అని బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం కాసిపేట మండలంలోని ముత్యంపల్లి, కాసిపేటలో రోడ్ షో నిర్వహించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని విమర్శించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే ఇక్కడే ఉంటున్నానని చెబుతూ భూ కబ్జాలు తప్పితే అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నాయని.. కాంగ్రెస్ హయాంలో మంజూరైన పాఠశాలల భవనాలే కనిపిస్తున్నాయని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు.
బెల్లంపల్లిని అ న్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తమ ట్రస్ట్ ద్వారా సైతం గ్రామ గ్రామాన సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేముల కృష్ణ, రత్నం ప్రదీప్, సిద్ధం తిరుపతి పాల్గొన్నారు. కన్నెపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ పుల్లూరి రాజయ్య స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. గడ్డం వినోద్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.
బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సింగరేణికి మనుగడ ఉంటుందని, లేకుంటే మోదీ, కేసీఆర్ కలిసి సింగరేణి సంస్థలు వేలంపాట ద్వారా కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తారని కాంగ్రెస్ బెల్లంపల్లి అభ్యర్థి గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని బొగ్గు గని ఆవరణలో నిర్వహించినగేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు.
గడ్డం వెంకట స్వామి సింగరేణి సంస్థ బీఐఎఫ్ఆర్ కు వెళ్ళకుండా రూ.650 కోట్ల మారిటోరియం ఎన్టీపీసీ ద్వారా కేంద్రానికి ఇప్పించి సింగరేణి సంస్థను కాపాడరని వినోద్ గుర్తుచేశారు. నేడు సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. బెల్లంపల్లిలో కొత్తగా బాగ్గు గనులను ఏర్పాటు చేయకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాస్టులతో బెల్లంపల్లిలో జీఎం కార్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని వినోద్ హామీ ఇచ్చారు.
సింగరేణి సంస్థనును లూటీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం..
రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థనును లూటీ చేసిందని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్ టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ సిద్దం సెట్టి రాజమౌళి అన్నారు. సింగరేణి సంస్థ తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్న సీఅండ్ఎండీ శ్రీధర్ డీఎంఎఫ్టీ నిధుల పేరుతో వందలాది కోట్లు సింగరేణితో సంబంధంలేని ప్రాంతాల్లో ఖర్చు చేశారని ఆరోపించారు. సమావేశంలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, ఏఐటీయూసి, ఐఎన్టీయూ సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య, భూమయ్య, కుక్కల ఓదెలు, దాగం మల్లేష్, దాసరి తిరుపతి గౌడ్, బొంకూరి రాంచందర్, మల్లారపు చిన్న రాజం, మంతెన రమేష్, బియ్యాల ఉపేందర్, రత్నం ప్రవీణ్ లతో పాటు పెద్దసంఖ్యలో సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ లో వంద మంది యువకుల చేరిక
కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి అభ్యర్థి గడ్డం వినోద్ సమక్షంలో 15వ వార్డు టేకులబస్తీకి చెందిన 100 మంది బీఆర్ఎస్ పార్టీ కి చెందిన యువకులు కాంగ్రెస్లో చేరారు. శుక్రవారం టేకుబస్తీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ వార్డు ప్రెసిడెంట్ కన్నూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ యూత్ లీడర్లు చింతల లోకేశ్, కుషనపల్లి రావణ్, బొల్లి వంశీ, దేవసాని ప్రశాంత్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరందరికి గడ్డం వినోద్ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు పట్టణ ఎన్నికల ఇన్ చార్జి కేవి ప్రతాప్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, నాయకులు మోదుంపల్లి కిరణ్, కాసిపాక రాజరత్నం, సోగాల రవికుమార్ పాల్గొన్నారు.
కాంగ్రెస్లోకి వేద ప్రకాశ్ ..
నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ లీడర్ కొండగుర్ల వేద ప్రకాశ్ శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బెల్లంపల్లి పట్టణంలోని గడ్డం వినోద్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వేద ప్రకాశ్ తో పాటు 50 మంది యవకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినోద్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.