- జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థి జనంపల్లి అనిరుధ్‌రెడ్డి
జడ్చర్ల/ మిడ్జిల్, వెలుగు : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మిడ్జిల్ మండలంలో ఇసుక, అసైన్డ్ భూములు తప్ప ఏమి కనిపించవని జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థి జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ఆరోపించారు. మిడ్జిల్ మండలంలోని మున్ననూరు, వాడ్యాల, వేముల, మసిగుండ్లపల్లి, ఈదులబాయితండా, చౌటకుంటతండా, రాయినోనికుంటతండా, మంగళిగడ్డతండా, సింగందొడ్డి, దోనూర్, వస్పూల, వల్లభురావుపల్లి, లింబ్యతండాలలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. వివిధ పార్టీల లీడర్లు కాంగ్రెస్‌లో చేరారు. అనిరుధ్‌రెడ్డికి బోనాలతో స్వాగతం పలికారు.
అనిరుధ్రెడ్డిమాట్లాడుతూ మండలంలో ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు పిల్ల కాల్వలు ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదన్నారు. ఒక్క కుటుంబానికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయలేదని విమర్శించారు. ఇన్ని సమస్యలుంటే సీఎం సభలో రెండు పోలీస్స్టేషన్లు అడగడమేమిటని ప్రశ్నించారు. పేదలకు కావాల్సింది పోలీస్ స్టేషన్లు కాదని, వారి సంక్షేమానికి కావాల్సిన పథకాలన్నారు. సిలిండర్ పట్టుకొని ధర్నా చేసినోల్లు సిలిండర్ ధర ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారు.
ALSO READ : ఓటు ఎలా వేయాలో అవగాహన కల్పిస్తాం : ప్రశాంత్ జీవన్ పాటిల్
కాం గ్రెస్ వస్తే కరెంట్ ఇవ్వదని ఈ బ్రాందీ ప్రభుత్వం విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ది కోసం తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని అభ్యర్థించారు. జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ మహ్మద్ గౌస్, మండల అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి, ఎంపీటీసీ గౌస్, మల్లికార్జున్ రెడ్డి, వెంకటేశ్, రాజేశ్, సాయిలు, లక్ష్మణ్, లక్ష్మారెడ్డి, పర్వతాలు, ఉస్మాన్, కృష్ణ, జహీర్ పాల్గొన్నారు.