టైం చూసుకోవాలి కదా : రాజగోపాల్ రెడ్డి పరుగో పరుగు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..  కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 9వ తేదీ గురువారం మునుగోడు నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. భారీ ఎత్తున ర్యాలీగా.. కార్యకర్తలతో తరలివచ్చారు. అభిమానం పోటెత్తటంతో.. టైం చూసుకోలేదు.. మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ దాఖలు చేయటానికి సమయం ఉండటం.. అప్పటికే సమయం దగ్గర పడటంతో.. హైరానా పడ్డారు.

నామినేషన్ దాఖలు చేసే రిటర్నింగ్ అధికారి ఆఫీసుకు 500 మీటర్ల ముందే వాహనాలను నిలిపివేస్తున్నారు పోలీసులు. దీంతో ఆయన కారు దిగి.. ఆఫీస్ వరకు పరుగులు పెట్టటం కనిపించింది. ఆయన వెంట సెక్యూరిటీ సిబ్బంది కూడా పరుగులు పెట్టారు. నిమిషం ఆలస్యం అయినా నామినేషన్ స్వీకరించరు.. మరో రోజు గడువు ఉన్నా.. మంచి ముహూర్తం కావటంతో.. గురువారమే నామినేషన్ వేయాలని డిసైడ్ అయ్యారు.

ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్లటం ఇష్టం లేక.. నామినేషన్ పత్రాలతో.. రిటర్నింగ్ ఆఫీసుకు పరుగులు పెట్టారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆయన పరుగుకు కారణం ఇదీ.. ఏదో ఏదో అనుకుని.. ఏదోదే ఊహించుకోవద్దే..