కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు (చండూరు) వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్​ జెండా ఎగరడం ఖాయమని  కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పీఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో ముఖ్య ముఖ్య కార్యకర్తల సమావేశంలో  ఆయన మాట్లాడారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అండగా నిలుస్తానన్నారు. టికెట్ రాలేదని చలమల్ల కృష్ణారెడ్డి  పార్టీ మారడం సరైంది కాదన్నారు. ఆరు గ్యారంటీల తో కాంగ్రెస్ పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వివిధ గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో  పోలగోని సత్యం,  నన్నూరు విష్ణువర్ధన్ రెడ్డి,  భీమనపల్లి సైదులు, పాల్వాయి చెన్నారెడ్డి , సర్పంచ్ ఎంకన్న యాదవ్ ,  జిట్టగోని యాదయ్య ,  బూడిద లింగయ్యా యాదవ్ , పాలకూరి యాదయ్య గౌడ్ , దేశిడి యాదయ్య గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : బీజేపీకి షాక్.. దానం నాగేందర్ సమక్షంలో కారెక్కనున్న కార్పొరేటర్ దంపతులు