- గెలుపునకు సహకరించాలని విజ్ఞప్తి
యాదాద్రి, వెలుగు : భువనగిరి నుంచి పోటీ చేస్తున్న తన గెలుపునకు సహకరించాలని కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్ రెడ్డి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును కోరారు. హైదరాబాద్‌లోని మోత్కుపల్లి నివాసానికి వెళ్లిన కుంభం భువనగిరిలోని తాజా రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు.
బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని, కాంగ్రెస్ గాలి వీస్తోందని చెప్పారు. ఇంకొంత కష్టపడితే భారీ మెజార్టీ వస్తుందని, తన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరారు. అందుకు మోత్కుపల్లి సమ్మతించారు. కాంగ్రెస్ గెలుపు కోసం తప్పకుండా పనిచేస్తానని మాటిచ్చారు.