సింగరేణి ఏరియాను బొందలగడ్డ చేశారు : మక్కాన్ సింగ్

గోదావరిఖని, వెలుగు : ఉద్యమం టైంలో ఓపెన్​కాస్ట్​గనులను బంద్​చేయిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇప్పుడు సింగరేణి ఏరియాను  బొందలగడ్డగా మార్చారని రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ విమర్శించారు. గురువారం గోదావరిఖనిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ సింగరేణి ఏరియాలో ఓపెన్ కాస్ట్ గనుల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్​చేశారు.

ఓపెన్ కాస్ట్ గనుల ఏర్పాటు నిర్ణయాన్ని విరమించికోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానికంగా నీరు, బొగ్గు అందుబాటులో ఉన్నా రామగుండంలో విద్యుత్​ప్లాంటును పునరుద్ధరించకుండా యాదాద్రి జిల్లాలో విద్యుత్​ప్లాంట్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. పక్కనే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్నా రామగుండం నియోజకవర్గంలో సాగునీరు అందడం లేదన్నారు.

ALSO READ : ఆరు గ్యారంటీలను పక్కా అమలు చేస్తాం : యెన్నం శ్రీనివాస్​ రెడ్డి

తాము అడిగే ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమాధానం చెప్పి రామగుండంలో పర్యటించాలని మక్కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్ చేశారు. అనంతరం ఫాస్టర్లతో జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు మద్దతిచ్చి తనను గెలిపించాలని కోరారు.