గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా : మక్కాన్‌‌‌‌ సింగ్‌‌‌‌ రాజ్‌‌‌‌ఠాకూర్‌‌‌‌

  • రామగుండం కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థి ‌‌ఠాకూర్‌‌‌‌

గోదావరిఖని, వెలుగు : పదేండ్ల బీఆర్ఎస్​పాలనలో రామగుండం ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లతో బొందలగడ్డగా మారిందని, తనను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థి మక్కాన్‌‌‌‌ సింగ్‌‌‌‌ రాజ్‌‌‌‌ఠాకూర్‌‌‌‌ తెలిపారు. మంగళవారం సింగరేణి జీడీకే 11వ బొగ్గుగనిపై కార్మికులను కలుసుకుని ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొరల గడీల పాలనను అంతం చేసి సింగరేణిని కాపాడుకునే బాధ్యత కార్మికులందరిపై ఉందన్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో సింగరేణిని దోచుకున్నారే తప్ప అందులో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించలేదన్నారు.

డీఎంఎఫ్‌‌‌‌టీ, సీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ నిధులను సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో ఖర్చు చేయాల్సి ఉండగా సీఎం కేసీఆర్‌‌‌‌ తన అధికారాన్ని ఉపయోగించి సంస్థకు సంబంధం లేని సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌కు తరలించారన్నారు. అనంతరం ప్రజా దీవెన యాత్రలో భాగంగా రాజ్‌‌‌‌ఠాకూర్‌‌‌‌ మేదరిబస్తీ, శివాజీనగర్‌‌‌‌, గణేశ్‌‌‌‌ నగర్‌‌‌‌, మార్కండేయకాలనీ, తదితర ప్రాంతాలలో ప్రచారం చేపట్టారు.

ALSO READ : అసలైన పేదలకు ఒక్క పైసా రాలేదు : రఘునందన్​రావు 

కార్యక్రమంలో ఐఎన్‌‌‌‌టీయూసీ సెక్రటరీ జనరల్‌‌‌‌ బి.జనక్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌, సెంట్రల్‌‌‌‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ఎస్‌‌‌‌.నరసింహరెడ్డి, గుమ్మడి కుమారస్వామి, పి.మల్లికార్జున్‌‌‌‌, పి.ధర్మపురి, కె.సదానందం, వికాస్ కుమార్‌‌‌‌, గడ్డం కృష్ణ, తిరుపతి, శ్రీనివాస్, ఏఐటీయూసీ లీడర్లు కె.స్వామి, ఆరెల్లి పోషం, తదితరులు పాల్గొన్నారు.