కేసీఆర్​ ప్రభుత్వాన్ని గద్దెదించాలి : మేడిపల్లి సత్యం

చొప్పదండి, వెలుగు : బూటకపు హామీలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్​ ​ప్రభుత్వాన్నిగద్దె దించాలని చొప్పదండి కాంగ్రెస్​ అభ్యర్థి మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. చొప్పదండి మండలం భూపాలపట్నం, వెదురుగట్ట గ్రామాల్లో శ్రేణులతో కలిసి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులందరికీ ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయడంతోపాటు ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తామన్నారు.

రెండుసార్లు ఓడినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నానని, తనకు అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. చొప్పదండిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు రాజేశం, వైస్​ ఎంపీపీ విజయలక్ష్మి, లీడర్లు సుధాకర్, చందు పాల్గొన్నారు.

ALSO READ : కేసీఆర్​ ముందుచూపుతోనే తండాల అభివృద్ధి : కందాల ఉపేందర్​రెడ్డి