బీజేపీ, బీఆర్ఎస్​ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నాయి : ఎంఎస్ రాజ్ ఠాకూర్

బీజేపీ, బీఆర్ఎస్​ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నాయి : ఎంఎస్ రాజ్ ఠాకూర్

గోదావరిఖని/ యైటింక్లయిన్‌‌‌‌‌‌‌‌కాలనీ : బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సింగరేణి ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణను ప్రోత్సహిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు. బుధవారం రామగుండం సింగరేణి ఏరియా అర్జీ 2 గనులపై ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ సెక్రటరీ జనరల్‌‌‌‌‌‌‌‌ జనక్ ప్రసాద్, కార్పొరేటర్ శంకర్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఓసీపీ‒3, వకీల్‌‌‌‌పల్లి మైన్‌‌‌‌‌‌‌‌లో గని కార్మికులను కలిసి తనను  గెలిపించాలని కోరారు. కాంగ్రెస్​గెలిస్తే కార్మిక వాడలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికులు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్నారు. అనంతరం యైటింక్లయిన్‌‌‌‌‌‌‌‌కాలనీలో ఎంఎస్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. 

ALSO READ : రూ.350కోసం.. కత్తితో 100సార్లు పొడిచి.. డెడ్ బాడీ పక్కనే డ్యాన్స్