మాయ మాటలకు మోసపోవద్దు : రోహిత్ 

రామాయంపేట, వెలుగు : మీ పిల్లల భవిష్యత్​ను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ను  గెలిపించి, కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ మెదక్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ కోరారు. గురువారం మండలంలోని అక్కన్నపేట, ఝాన్సీ లింగా పూర్, తొనిగండ్ల, లక్ష్మాపూర్, కాట్రియాల్, పర్వతాపూర్, కిషన్ తండా, దంతే పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సీఎం కేసీఆర్ తీపి మాటలకు మోస పోవద్దన్నారు.

తెలంగాణను సోనియమ్మ ఇచ్చిందని కానీ కేసీఆర్​ ఆమెను మోసం చేశాడన్నారు. ఇందిరమ్మ రాజ్యం కోసం చేతి గుర్తు కు ఓటు వేయాలని కోరారు. తాము మాయ మాటలు చెప్పే వారిమి కాదని, చేతలతో చేసి చూపిస్తామన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో హామీలే తప్ప ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు.

మెదక్ నియోజక వర్గంలో ఈ పదేళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగ లేదని, ఆపై  ఉన్న అఫీసులని సిద్దిపేట కు తరలించారని ఆరోపించారు. ఒక్క సారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా నని తెలిపారు. కార్యక్రమంలో చౌదరి సుప్రభాత రావు, పల్లె రామచంద్రా గౌడ్, విప్లవ్, నాగులు, వెంకటేశం ఉన్నారు.

ALSO READ : జీవన్ రెడ్డిని తరిమికొడితేనే ఆర్మూర్ అభివృద్ధి సాధ్యం : వినయ్ రెడ్డి