సీఎం కేసీఆర్ను కలిశానని తనపై వస్తున్న వార్తలపై కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని అందులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పాల్వాయి స్రవంతి అధికారులను కోరారు.
ఇదిలా ఉంటే మునుగోడులో ఉపఎన్నిక పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నడూ లేనంతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.