గడపగడపకు ప్రచారంలో భాగంగా మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా నారాయణపూర్ మండలం పుట్టపక గ్రామంలో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, నారాయణపురం మండల ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు గ్రామ మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రతి ఒక్క సమస్యనూ తెలుసుకుంటూ పాల్వాయి స్రవంతి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే చేనేత కార్మికుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి పాల్వాయి స్రవంతి హామీ ఇచ్చారు.
మునుగోడు ఉప ఎన్నికకు తేదీ ఖరారూ కావడంతో రాజకీయ పార్టీలు తమ కార్యాచరణలో మరింత వేగం పెంచాయి. ఇప్పటికే ప్రచారంలో మరింత దూకుడు ప్రదర్శిస్తోన్న పలు పార్టీలు.. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా వెళ్తున్నాయి. అన్ని పార్టీల తరహాలోనే మునుగోడు ఉపఎన్నికపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఎలాగైనా గెలుపు పగ్గాలు చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.