మునుగోడు ఉపఎన్నిక సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఆయా పార్టీల కీలక నేతలు మునుగోడు నియోజకవర్గంలో మకాంవేసి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. సూర్యగ్రహణం రోజు కూడా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చండూర్ మున్సిపాలిటీ అంగడిపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ కు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు.
కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పాల్వాయి స్రవంతి ప్రజలకు వివరిస్తున్నారు.తనను గెలిపిస్తే మునుగోడు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.