ఆర్మూర్, వెలుగు: తాను ఆర్మూర్ లోకల్ బిడ్డనని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన ఆర్మూర్ టౌన్ లోని కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
గడిచిన పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి, అవినీతి అక్రమాలకు పాల్పడిందన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోట్ల రూపాయల అవినీతి సొమ్మును కూడబెట్టారన్నారు. కాంగ్రెస్‌పార్టీకి చెందిన మాజీ మంత్రి అర్గుల్ రాజారాం హయాంలోనే నియోజకవర్గంలో ఇండ్ల జాగాలు ఇచ్చారని, ఆ తర్వాత ఏ పాలకులు పట్టించుకోలేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ లీడర్లు సాయిబాబా గౌడ్, కోల వెంకటేశ్, మహమూద్ అలీ, రేగుల సత్యనారాయణ, హబీబ్ పాల్గొన్నారు.