
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ చూసి ఓర్వలేకనే.. కాంగ్రెస్ నేతలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐటీ రైడ్స్ చేపిస్తున్నారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. 10 సంవత్సరాలలో నియోజకవర్గ అభివృద్ధి నిర్లక్ష్యం జరిగిందని.. నియోజకవర్గాన్ని హరీష్ రావు దత్తత తీసుకోవడం అనేది ఎమ్మెల్యే అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రజల గొంతుకనై నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.