12 శాతం ముస్లిం రిజర్వేషన్​ ఏమైంది : షబ్బీర్ అలీ

  •     అర్బన్ కాంగ్రెస్​ అభ్యర్థి షబ్బీర్ అలీ

నిజామాబాద్, వెలుగు : ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ​ఇస్తానని సీఎం కేసీఆర్ ​మోసం చేశారని అర్బన్ ​కాంగ్రెస్ ​అభ్యర్థి షబ్బీర్ అలీ విమర్శించారు. గతంలో కాంగ్రెస్​ గవర్నమెంట్​ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్​తో ఇప్పుడిప్పుడే డాక్టర్లు, ఇంజినీర్లుగా ముస్లిం యువకులు బయటకు వస్తున్నారన్నారు. ఆ రిజర్వేషన్​లోనూ ఒక శాతం కోతపెట్టి బీఆర్​ఎస్ ​సర్కారు అన్యాయం చేస్తోందన్నారు. శనివారం ఆయన ఆటోనగర్​లో ముస్లిం మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. మైనార్టీబంధులో 30 శాతం కమీషన్ ​తీసుకుంటున్న మంత్రి కేటీఆర్​కు ముస్లిం డిక్లరేషన్​పై మాట్లాడే హక్కులేదన్నారు.

తమ గవర్నమెంట్​హయాంలో రేషన్​దుకాణాల్లో తొమ్మిది రకాల వంట సామాన్లు ఇచ్చేవాళ్లమని, ఇప్పుడు బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదన్నారు. ఈ సారి కచ్చితంగా కాంగ్రెస్ ​ప్రభుత్వం వస్తుందని, ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. నిరుద్యోగ యువత ఇంటింటికి వెళ్లి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. డబ్బుతో గెలువాలనుకుంటున్న లీడర్లకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తాహెర్, కేశవేణు, గడుగు రోహిత్, జావీద్​అక్రమ్, పంచరెడ్డి, చరణ్, నజీబ్, అర్షద్​ పాల్గొన్నారు.